ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది.. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్ కచ్చితంగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆధార్ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పథకాలు తిరస్కరించకూడదు.. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్ నంబరు కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం తెలిపింది.మరోవైపు ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీ చేస్తారు. దీనికి సంబంధించి ఎలాంటి సర్వీస్ చార్జీలు వసూలు చేయరు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రజల నుంచి వినతులను కూడా స్వీకరించనున్నారు.రాష్ట్రంలో 15,004 సురక్ష క్యాంపుల నిర్వహిస్తున్నారు.. ా1902్ణతో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా పథకాలు అందేలా చూస్తారు. అర్హులైన ఉండి లబ్ధి అందకపోతే.. అర్హులను గుర్తించి పథకాలే కాదు వారికి కావాల్సిన పత్రాలను కూడా ఇష్తారు.