వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మరో నేత ఝలక్ ఇచ్చినట్లు అవుతుంది. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పటికే పలువురు కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు.