Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్‌ ఐదో తేదీకి వాయిదావేసింది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయలేదు. విచారణ సందర్భంగా సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నదని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో సీబీఐ కౌంటర్‌ దాఖలుకు గడువు ఇస్తూ విచారణను వచ్చే నెల 5కు కోర్టు వాయిదా వేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తీహార్ జైలులోనే ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img