తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు, లడ్డూ చుట్టూ నెలకొన్న వివాదంపై ట్విట్టర్ లో స్పందించిన ప్రకాశ్ రాజ్… తాజాగా మరో పోస్టు పెట్టారు. ఆయన ట్వీట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ వెనక్కి తగ్గడంలేదు. ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దీనిపై తాను ఇండియాకు వచ్చిన తర్వాత జవాబిస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేశారు. ాామనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్్ణ్ణ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.