ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో న్యూ లిక్కర్ పాలసీ నివేదికకు ఆమోదం తెలుపనున్నారు. ఇటీవలే బుడమేరు బెజవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. బుడమేరుకు మరమ్మతులు, లైనింగ్ పనులు చేయించేందుకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. అలాగే రేపటి నుంచి రాష్ట్రంలో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానుండగా.. వాటిపై కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.