నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గ్రామ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరనున్నారు. 11.40 గంటలకు కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో వానపల్లిలోని పళ్లాలమ్మ గుడి ప్రాంతానికి 11.50 గంటలకు చంద్రబాబు చేరుకుంటారు. 11.50 గంటల నుండి 1.30 గంటల వరకూ స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.
- తర్వాత 2 గంటల నుండి 2.20 వరకూ ప్రజా ప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు భేటీ కానున్నారు. 2.20 గంటలకు వానపల్లి గ్రామం నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి 2.35 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లిహిల్స్ లోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.