కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయినట్టుగా అధికారులు శనివారం ప్రకటించారు. అధిక వర్షాల మూలంగా రద్దయినట్లుగా టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవంగా ఇవాళ ఉదయం పత్తికొండలో ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉంది. అయితే వీటిలో స్వల్ప మార్పులు చేసి ముఖ్యమంత్రి పర్యటనను ఓర్వకల్లుకు ఖరారు చేశారు. కానీ గత రాత్రి నుంచి జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దయినట్లు వెల్లడించారు.