విశాలాంధ్ర-హైదరాబాద్ : సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గురువారం హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలను అభినందించారు. రామకృష్ణ వెంట సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు.