టీడీపీ నేత వంగవీటి రాధా ఈరోజు ఉదయం స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూౌ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.