విశాలాంధ్ర నెల్లూరు బ్యూరో : జలదంకి మండలం తెలుగుదేశం పార్టీ ఐటీ సెల్ అధ్యక్షులు ఏగూరి రఘు వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు 20వేల రూపాయల చెక్కును మండల పార్టీ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి అందజేశారు. ఏగూరి రఘు గతంలో జలదంకి మండలం ఎస్సి సెల్ అధ్యక్షులుగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. చిన్న కుటుంబమే అయినా ఎంతో పెద్ద మనసుతో రిలీఫ్ ఫండ్ కు20వేల రూపాయల చెక్కును అందజేసి రఘు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మునగాల తిరుమలరెడ్డి, ఉప్పుటూరి సుధీర్ ,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.