వరద సమయంలో విపత్తు నుండి చాలా తక్కువ సమయంలో బయటపడగలిగామని, సిఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ౌ వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామన్నారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగామన్నారు. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందని, అధికార యంత్రాంగంతోపాటు తాను కూడా స్వయంగా బురదలో దిగానని చెప్పారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామని, సిఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు వెల్లడించారు.