Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 14, 2024
Saturday, September 14, 2024

అసంపూర్ణ చర్చలు

. అరకొర హామీలు
. మధ్యంతర భృతికి నిరాకరణ
. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై దాటవేత
. మంత్రుల బృందంతో ఉద్యోగుల చర్చలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు, ఇతర సర్వీసు అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. పీఆర్సీ, పెండిరగ్‌ డీఏలు, పెన్షన్‌ బకాయిలు తదితర డిమాండ్లపై చర్చించింది. అరకొర హామీలతోనే సరిపెట్టారు. ముఖ్యమైన అంశాలపై దాటవేశారు. సానుకూలత అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇవ్వాలని పట్టుపట్టారు. ప్రధానంగా 12వ పీఆర్సీ ఆలస్యమైనందున, వెంటనే 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేయగా, మంత్రుల బృందం నిరాకరించింది. తాము వచ్చే జులైలో పీఆర్సీ ఇస్తామని అంటున్నప్పుడు ఐఆర్‌ ఎందుకని ప్రశ్నించింది.
సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖాధికారి చైతన్య, సర్వీసెస్‌ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ తదితర అధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నుంచి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ, ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, మల్లు రఘునాథరెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.హృదయరాజు, ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎస్‌.బాలాజీ, ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌, ఆల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్‌ అసోసియేషన్ల అధ్యక్షులు చంద్రశేఖర్‌, మల్లేశ్వరరావు, ఏపీ వెటర్నరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాఘవరావు, తదితర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సమస్యలపై స్వల్పంగానే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐఆర్‌ ఇవ్వలేమని, నేరుగా జులై నాటికి పీఆర్సీ అమలు చేస్తామని తేల్చిచెప్పింది. 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్‌కు సానుకూలంగా ఉంది. దానిపై త్వరలో మరోసారి చర్చించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ క్లైమ్స్‌ గత సమావేశం తర్వాత రూ.80 కోట్లు చెల్లించామని వివరించింది. పీఆర్సీ సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చామని, టీఏ బకాయిలు రూ.70 కోట్లు చెల్లించామని తెలిపింది. సీపీఎస్‌ బకాయిలు రూ.100 కోట్లు చెల్లించామని, అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ 70 సంవత్సరాలకు, 75 సంవత్సరాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న పెంపులో కొంత మేరకే సానుకూలంగా వ్యవహరించింది. దానిపై రెండిరటి అమలుకు ఉద్యోగ సంఘాలు పట్టుపట్టడంతో త్వరలో నిర్ణయిస్తామని హామీ ఇచ్చింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కారుణ్య నియామకాల వివరాలు జిల్లాల వారీగా తెప్పించుకుని త్వరలో పరిష్కరిస్తామని తెలిపింది. ఒప్పంద ఉద్యోగులను గతంలో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా రెగ్యులర్‌కు నిర్ణయించింది. గత సమావేశ మినిట్లకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని, ఆర్థికేతర డిమాండ్లను శాఖల వారీగా ఆయా స్థాయిలో పరిష్కరించడానికి ఉత్తర్వులు జారీజేస్తామని మంత్రులు బృందం హామీ ఇచ్చింది.
జీవోల ఆధారంగా ఉద్యమ కార్యాచరణ : ఏపీఎన్జీవో
అనంతరం బొప్పరాజు, బండి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. నాలుగు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరామన్నారు. పీఆర్సీ, పెండిరగ్‌ డీఏలు, పెన్షన్‌ బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించినట్లు చెప్పారు. ఆలస్యం చేయకుండా ఐఆర్‌ ఇవ్వాలని, మహిళల చైల్డ్‌కేర్‌ లీవులను 18 సంవత్సరాలలోపే వాడుకోవాలన్న నిబంధనల్ని తొలగించాలని కోరామన్నారు. తమ డిమాండ్లపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ డిమాండ్లపై జీవోలు వచ్చేంతవరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 30 శాతం ఐఆర్‌ అడిగితే, ప్రభుత్వం పీఆర్సీ ఇస్తామని చెబుతోందన్నారు. ప్రభుత్వం వెల్లడిరచే జీవోల ఆధారంగా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. మంత్రి బొత్సకు సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు వివరించారు. ఎన్నికల కోడ్‌ రాకముందే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల కోడ్‌కూ, బకాయిలకూ సంబంధం ఏమిటని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్చిలోపు బకాయిల విడుదల: బొత్స
ఉద్యోగుల బకాయిలను మార్చిలోపు విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. ఉద్యోగ సంఘాలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పూర్తిస్థాయిలో పీిఆర్సీనే ప్రకటిస్తామంటూ ఉద్యోగులకు చెప్పామన్నారు. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేక పోయామని, అందుకే ఐఆర్‌ ఇస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోర్టు కేసుల వల్ల నిలిచిపోయి ందని చెప్పారు. ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ విరమించుకోవాలని కోరారు. చాలా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించామని బొత్స చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img