Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

కోల్‌కతా హత్యాచార ఘటన.. గణేష్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం.. అవన్నీ బంద్

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం ఘటన ఒక్క పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటన జరిగి 20 రోజులు అవుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే గణేష్ నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. అయితే కోల్‌కతాలో గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించే.. ఉత్సవ కమిటీ ఈ సారి సంచలన నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. హంగులు, ఆర్భాటాలకు దూరంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా ఇలాంటి అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. గణేష్ ఉత్సవాన్ని భారీ లైట్లు, అలంకరణలకు దూరంగా జరపాలని కోల్‌కతా గణేష్ పూజ కమిటీలు నిర్ణయించాయి.అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం అనే థీమ్‌తో ఈసారి వినాయకుడి పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈసారి సాల్ట్‌లేక్‌లోని బీ బ్లాక్‌లో జరిగే 15 ఏళ్ల గణేష్ పూజ కోసం.. చందర్‌నగర్ నుంచి కొనుగోలు చేసిన లైట్లను పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ప్రత్యేకమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన చందర్‌నగర్ లైట్లను గణేష్ నవరాత్రోత్సవాల్లో ఉపయోగించాలని.. కోల్‌కతా ఘటన నేపథ్యంలో ఈసారి వాటిని పూజలో ఉపయోగించడం లేదని నిర్వాహకులు వెల్లడించారు.
గణేష్ పండల్‌కు వెళ్లే దారిలో కనీస లైటింగ్ మాత్రమే ఉంటుందని పూజా కమిటీ ప్రెసిడెంట్ అనింద్యా ఛటర్జీ తెలిపారు. ఇక పండల్ లోపల కేవలం ఎరుపు రంగు లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పీఎన్బీ ద్వీపం సమీపంలోని గణేష్ పండల్ పూర్తిగా దర్శన్ రుఖ్ దిన్ (అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం) అనే సందేశంతో కటౌట్‌లతో కప్పబడి ఉంటుందని అనింద్యా ఛటర్జీ స్పష్టం చేశారు. ఇక గణేష్ పండల్‌లో చిన్న చిన్న అక్షరాలతో కొన్ని నినాదాలు కూడా రాయిస్తామని తెలిపారు. మనం ఇలాంటి అత్యాచార ఘటనలను ఇప్పుడే ముగించకపోతే.. ఇంకా చాలా మంది వీటి బారిన పడే అవకాశం ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిరాలి కుటుంబానికి తామంతా ఉన్నామని భరోసా కల్పించారు. ఈ ఘటనపై పూజారులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తారని తెలిపారు. బాగ్ బజార్ సర్బోజనిన్ గణేష్ పండల్‌లో మరో 2 లైట్లను ఏర్పాటు చేయాలన్న ఆర్డర్‌లను రద్దు చేసినట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధి తెలిపారు. 12 ఏళ్లుగా ఈ పూజలు నిర్వహిస్తున్నామని.. స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పూజను రద్దు చేయలేమని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img