స్విట్జర్లాండ్లో జరుగుతున్న లౌసానే డైమండ్ లీగ్లో భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఈ సీజన్లో తన బెస్ట్ త్రో(89.49 మీటర్లు) విసిరి 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 4వ రౌండ్లో 4వ స్థానంలో ఉన్న ఆయన, 5వ అటెంప్ట్ 85.58 మీటర్లు, 6వ అటెంప్ట్ 89.49 మీటర్లు విసరడం ద్వారా 2వ స్థానానికి ఎగబాకాడు. ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన గ్రెనడా క్రీడాకారుడు ఆండర్సన్ పీటర్స్ ఈ లీగ్ లో తొలి స్థానంలో నిలిచాడు.