మస్క్ ఆధ్వర్యంలో న్యూరోలింగ్ కంపెనీ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి
ఆవిష్కరణలకు పెద్దపీట వేసిన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌మస్క్ ఆధ్వర్యంలో న్యూరోలింగ్ కంపెనీ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమరిక కోసం న్యూరాలింక్ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని పొందినట్లు సంస్థ వెల్లడించింది. అనుకోని ప్రమాదాల్లో చూపు పోయినవారికి, పుట్టుకతో చూపులేనివారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది. మెదడు నుంచి కంటికి సంకేతాలు అందే ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ చిప్ అంధులకు మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూసి అందరిలా జీవించే అవకాశం కల్పిస్తుంది. బ్రెయిన్‌లోని ఆప్టికల్ ప్రాసెసింగ్ ప్రాంతాలతో ఇది నేరుగా అనుసంధానమై ఉంటుందని వివా టెక్ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
కోతిపై పరిశోధన సక్సెస్
మెదడు లేదా వెన్నెముక గాయాలను పూర్తి స్థాయిలో నయం చేయడం ద్వారా అంధులు తిరిగి చూడగలుగుతారని మస్క్ తెలిపారు. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశం అని న్యూరాలింక్ పరిశోధకులు గతంలో చెప్పారు. మస్క్ మాట్లాడుతూ ౌ చూపు తెప్పించే ఈ బ్రెయిన్ చిప్ గురించి వివరించారు. కళ్లు లేని కోతులకు ఈ చిప్ ను అమర్చగా అవి చూడగలుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి విజన్ అస్పష్టంగా ఉన్నప్పటికీ మనిషి మెదడులో ఈ చిప్ అమర్చే సమయానికి నాణ్యత మెరుగుపడుతుందన్నారు. ఈ చిప్ అమర్చిన తరువాత ఏ కోతి చనిపోవడం కానీ, తీవ్రంగా గాయపడటం కానీ జరగలేదన్నారు. మస్క్ చెప్పినట్లుగా ఈ చిప్ అందుబాటులోకి వస్తే వైద్యపరంగా అదో విప్లవం అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ చిప్‌తో సాధారణ మనుషుల్లా చూడొచ్చు : మస్క్
చూపును తెప్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా 2020లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ రూపొందించారు. 2021 లో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ రెటీనాను అమర్చారు. కళ్ళజోడుకు అమర్చిన ఈ ఆర్టిఫిషియల్ రెటీనా లైట్ ను గుర్తించి ఎలక్ట్రికల్ సిగల్స్ ద్వారా సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. మస్క్ అభిప్రాయం ప్రకారం .. ఈ పరికరాల వల్ల కలుగుతున్న ఉపయోగం చాలా తక్కువ. న్యూరాలింక్ తయారు చేసిన చిప్‌తో అందులో సాధారణ మనుషుల్లా చూడొచ్చు అన్నది మస్క్ చెబుతున్న మాట.
సందేహాలు
ఈ చిప్ పైన ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిప్ అమర్చిన కోతులకు పుట్టుకతోనే చూపు లేదా ? లేక మధ్యలో చూపు కోల్పోయాయా ? చిప్ అమర్చిన కోతులు ఇక ఎప్పటికీ చూపు కోల్పోయే ప్రమాదం లేదా ? వంటి సందేహాలు కలుగుతున్నాయి. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ న్యూరో ఇంటర్ఫేస్ చిప్ ఇన్వర్షన్ మెకానిజం ద్వారా కోతుల్లో జరుగుతున్న పరిశోధనలు వాటి ద్వారా వస్తున్న వార్తలు మనము చదువుతూ చూస్తూ ఉన్నామని, కోతుల్లో చేసిన పరిశోధనలు కొంతవరకు సత్ఫలితాలిచ్చినట్లు చూశాం కానీ సంతృప్తికరమైన అనుకున్న విధంగా లక్ష్యాలు సాధించలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. కోతుల్లో అవి 100 శాతం సఫలమైతే మనుషుల్లో కూడా అలాంటి ఫలితాలను మనం ఆశించవచ్చునన్నారు. ప్రకృతిసిద్ధంగా వచ్చిన ఈ పద్ధతులను లేకపోతే జీవంతోపాటు వచ్చిన ఇవి జీన్స్‌తో లింక్ అయి ఉన్న పలు జ్ఞానేంద్రియాలను ఒక చిప్‌తో నియంత్రించడం అనేది ఒక పరిశోధనలో భాగమని అయితే ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలని చెప్పారు. బ్లైండ్ సైడ్ చిప్ ఎలా పనిచేస్తుందన్న విషయమై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. అయితే మెదడు నుండి కంటికి సంకేతాలు పంపగలగడం ఈ చిప్ తో సాధ్యమైతే కనుక కోట్లమంది అంధుల జీవితాల్లో వెలుగు వచ్చినట్లే..!