రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సం తనను ఎంతగానో కలచి వేసిందని నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు తొందర్లోనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలకు తనవంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.