విజయవాడలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సున్నపు బట్టీల వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు పడటంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండరాళ్ల కింద ముగ్గురు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చిక్కుకున్న మేఘన మరణించింది.. ఇద్దరిని వెలికి తీసేందుకు రెస్క్యూ టీమ్స్ పని చేస్తున్నాయి. ఇక బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీ లు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయిన పరిస్థితి.. బస్సుల్లో దాదాపు యాభై మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజాము నుంచి బస్సులోనే పడిగాపులుకాస్తున్నారు. అయితే సహాయక చర్యలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. అటు భారీ వర్షాలకుఅలాగే వన్‌టౌన్ పితాని అప్పలస్వామి స్ట్రీట్ వద్ద సపోర్ట్ గోడ మెట్లు కూలడంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్న వారు బయటకి రావడంతో ప్రమాదం తప్పినట్లైంది. డ్రైనేజీ నీరు ఇంట్లోకి రావడంతో రాత్రి నుంచి చిన్న పిల్లలు, మహిళలతో జాగారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.