ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈరోజు జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు.పోలీసులు ఈ రోజు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన పలు వివరాలు సేకరించిన పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు.
బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించినట్లుగా కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని టాలీవుడ్ లైంగిక వేధింపుల ప్యానెల్ తెలిపింది. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.