బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద రణరంగం వాతావరణం నెలకొంది.. ఆయన ఇంటిపై పై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.. కాగా, హైదరాబాద్ కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటి కి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నేడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో చేరుకున్నారు.. ఈ సందర్భంగా పాడి ఇంట్లోకి అరికెపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకెళ్లారు. కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీ గేట్లు ధ్వంసమయ్యాయి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు..మ అదుపులోకి రాకపోవడంతో ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు..