నేడు ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) కొత్త సీఎంను ప్రకటించనున్న నేపథ్యంలో ఆప్ నేత సౌరభ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌కు సీఎం కావాలనే ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు. నేడు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన అనంతరం సీఎంగా ఒకరి పేరును ప్రకటిస్తారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉందని సౌరభ్ వెల్లడించారు. పార్టీ నుంచి సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా పర్వాలేదన్నారు. ఎందుకంటే ప్రజలు కేజ్రీవాల్‌ను సీఎంగా ఎన్నుకున్నారని, ఎప్పటికైనా ఆ కుర్చీ ఆయనకే చెందుతుందని మీడియాతో జరిగిన సమావేశంలో అన్నారు. నిఢిల్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోనని కేజ్రీవాల్ అన్నారు. అయితే గత ఎన్నిల్లో ప్రజల తీర్పు మేరకు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ కుర్చీ ఆయనకే చెందుతుంది. వచ్చే ఎన్నికలు జరిగే వరకు మాలో ఒకరు కుర్చీలో కూర్చుంటారు. రాముడు లేనప్పుడు(రామాయణంలో) భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో అదేవిధంగా మాలో ఒకరు దేశ రాజధానికి సీఎంగా ఉంటారుు అని సౌరభ భరద్వాజ్ పేర్కొన్నారు. కాగా, కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత, మంత్రులు అతీశీ, గోపాల్‌రాయ్, కైలాశ్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్‌ల పేర్లతో పాటు సౌరభ్ భరద్వాజ్ పేరు కూడా వినిపిస్తోంది.