London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకోనున్న సునీతా విలియమ్స్

వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ లు బోయింగ్ స్టార్ లైనల్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని విల్మోర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామని తెలిపారు. బాధ్యత గల అమెరికా పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ కర్తవ్యమని చెప్పారు. తమ విధిని నిర్వహించుకోవడానికి నాసా సహకరిస్తుందని అన్నారు.సునీత మాట్లాడుతూ… ఓటు వేయడం తమ బాధ్యత అని చెప్పారు. అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు. మరోవైపు అంతరిక్షం నుంచి వ్యోమగాములు ఓటు వేయడం ఇదే తొలిసారి కాదు. 1977 నుంచే వ్యోమగాములకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వ్యోమగాములు ఓటు వేయడానికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదే అయినప్పటికీ… నాసా దాన్ని కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img