జమ్ము కశ్మీర్ లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. జమ్ములో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.. 415 మంది అభ్యర్ధుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 5,060 కేంద్రాల్లో పోలీంగ్ కొనసాగుతోంది. కాగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడో విడతలో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.