London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

బోట్ల తొలగింపునకు కొనసాగుతున్న అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ..

ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ ప్రక్రియ మాడు రోజులుగా కొనసాగుతోంది. అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 12 అడుగుల నీటి లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది. ఒక్కొక్క పడవ 40 టన్నుల బరువు ఉండడంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్‌ అయిన.. క్రేన్ల సాయంతో పైకి తీసే ప్రయత్నం విఫలమైంది. దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు. చివరికి నాలుగో ప్లాన్‌గా ఉన్న అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ మేలు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్లాన్ అమలుకు గాననూ.. విశాఖపట్నం నుంచి సీ లయన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి నిపుణులను రప్పించారు. కంపెనీ ప్రతినిధి సూర్య అక్షిత్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డైవర్లు బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బోట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి బెకమ్‌ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు వర్కులను సీ లయన్‌ చేస్తుంటుంది కాబట్టి అండర్ వాటర్ ఆపరేషన్‌ను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన నిపుణులు ముందుగా బోట్ల వద్ద సర్వే చేశారు.

అనంతరం ఇద్దరు డైవర్లు ఆక్సిజన్‌ సిలిండర్లతో నీళ్లలోకి దిగి బోట్ల కింది భాగంలో పరిస్థితిని అంచనా వేశారు. బ్యారేజీ 67వ నంబరు గేటు దగ్గర రెండు బోట్లు పైకి కనిపిస్తున్నాయి. ఈ రెండింటికీ అడుగు భాగాన మరో బోటు ఉందని సీ లయన్‌ డైవర్లు గుర్తించారు. డైవర్లు.. నీళ్లలో 10 నుంచి 12 అడుగుల లోతుకి వెళ్లడంతో బోటును గుర్తించారు. అనంతరం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్లలో సర్వే చేసి ఆపై ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ఒక్కో బోటు కటింగ్‌ పూర్తికావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img