గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని తేలడం తో దీనిపై ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తు ను ముమ్మరం చేసారు. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కోందరూ బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్ పిలిపించి.. విచారించింది సిట్ బృందం. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరను కోడ్ చేసినప్పటికీ ఈ టెండర్ ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు, బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.