వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన వార్త ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందిరికీ తెలిసింది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.