Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

రిక్లెయిమ్‌ ది నైట్‌ పేరిట కోల్‌కతా వీధుల్లో మహిళల నిరసనలు

కోల్‌కతా ట్రైనీ విద్యార్థిని హత్య కేసులో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రిక్లెయిమ్‌ ది నైట్‌ ఉద్యమంలో భాగంగా ఆదివారం రాత్రి కోల్‌కతాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మహిళలు నిరసన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాదవ్‌పూర్‌, గరియా, బెహలా పర్ణశ్రీ, కన్నా, లేక్‌ టౌన్‌ సహా ఇతర ప్రాంతాల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలంతా మాకు న్యాయం కావాలి అని నినదించారు. బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు అరిందమ్‌ సిల్‌, కౌశిక్‌ గంగూలీ, నటి చుర్ని గంగూలీ కూడా ఈ ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. హత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలను అణిచివేసేందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేపడుతోంది. ఆర్‌జి కార్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ గోష్‌ను సిబిఐ విచారిస్తోంది.

ఢిల్లీ, ముంబయిల్లోనూ కొనసాగుతున్న నిరసనలు
ఢిల్లీ, ముంబయిల్లోనూ విద్యార్థులు నిరసనలు కొనసాగుతన్నాయి. ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో వైద్యులతో పాటు స్థానికులు ఆందోళన చేపట్టారు. ుప్రతి సంస్థ భద్రతను కలిగి ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా మనకు భద్రత లేకపోతే ప్రయోజనం ఏమిటి? వైద్యులు ఎల్లప్పుడూ మొదట రోగుల గురించి ఆలోచిస్తారు. వారి భద్రత గురించి కాదు. పని ప్రదేశాలు సురక్షితంగా లేకపోతే వైద్యుల పరిస్థితి ఏమిటి ?ు అని డాక్టర్‌ ప్రేర్నా గోమ్స్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img