విశాలాంధ్ర`పొన్నూరు: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు కఠిన ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇంచార్జి జక్కా శ్రీనివాస్ అన్నారు. గురువారం పొన్నూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగురూకతతో వ్యవహరించాలని సూచించారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వారిపై ఆంక్షలు విధించి, బేసిక్ క్వారంటైన్ పూర్తైనతరువాతే రాష్ట్రంలోకి అనుమతించాలని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. గత రెండు కోవిడ్ ఉదృతులు నేర్పిన పాఠాలతో ఈసారి ముందస్తు చర్యలకు ఉపక్రమించి, ప్రజల ధన, ప్రాణ నష్టాలనుండి కాపాడాలని, ఈసారి అలసత్వం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.