విశాలాంధ్ర`మొయినాబాద్ : ఆషాడమాస చివరి ఆదివా రాన్ని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామా ల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండ లంలోని హిమాయత్ నగర్, చిలుకూరు, పెద్ద మంగ ళారం, మొయినాబాద్ కనక మామిడి తదితర గ్రామాల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యా సాలు, శివసత్తుల పూనకాలు మధ్య మహిళలు పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. ఆయా గ్రామాల్లో అమ్మవార్ల పాటలతో అమ్మ వారి నామ స్మరణ మార్మోగింది. పెద్ద మంగళారం గ్రామంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.