బిజెపి నాయకులు పిసరి కృష్ణారెడ్డి
విశాలాంధ్ర-దుండిగల్ : బౌరంపేట్ లో ప్రభుత్వ పాఠశాలకు స్థలం కేటాయించాలని బిజెపి నాయకులు పిసరి కృష్ణారెడ్డి కోరారు.ఈ మేరకు నియోజకవర్గం పరిధి దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ లో ప్రభుత్వ పాఠశాలకు స్థలం కేటాయించాలని కోరుతూ, గురువారం బిజెపి నాయకులు పిసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పాఠశాల స్థలం ఏర్పాటు కై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బౌరంపేట్ లో ఇప్పటికే అర ఎకరంలో ఉన్న సర్కారు బడిలో విద్యార్థులకు సరిపడా వసతులు లేవని, ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థులు 800 పైగా విద్యను బోధిస్తున్నారని, వారికి సరిపడా ప్రస్తుత పాఠశాలలో క్రీడలకు ఇతరత్ర వాటికి గానీ స్థలం లేదని, బౌరంపేట్ సర్వేనెంబర్ 166, 472 లో దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, అట్టి స్థలంలో విద్యార్థులకు మౌలిక వసతులను ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రీడలకు అనుగుణంగా ఉండేటట్టు నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆకుల సతీష్, గోన మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అరుణ్ రావు తదితరులు పాల్గొన్నారు.