కుత్బుల్లాపూర్ వికలాంగుల సంఘ నాయకులు
విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : మహిళా కార్పొరేటర్ పై అనుచిత వాక్యాలు చేస్తే చెప్పుతో కొడతాం ఖబడ్దారని కుత్బుల్లాపూర్ వికలాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు.ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ ఓంజెండా నందు ఒక మహిళా కార్పొరేటర్ ను వికలాంగురాలు అని చెప్పి పార్టీలు మార్చుతు కాంగ్రెస్ లోకి వెళ్లిన శ్రీధర్ ఫోటోని ఉమా, రమేష్, వాణిలు కలిసి చెప్పులతో కొట్టి, నిరసన తెలియజేశారు.ఈ సందర్బంగా సభ్యులు మాట్లాడుతూ మహిళా కార్పొరేటర్ ని వికలాంగురాలు అని, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పులతో కొడతామన్నారు. శ్రీధర్ ఒక కబ్జా దారుడు,ఖాళీ పార్కు స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నించేవాడన్నారు.
ఆరోగ్యంగా ఉన్న మహిళాను వికలాంగురాలు అనడం సరైనది కాదని, వికలాంగులు అంటే ఆయన చిన్న చూపుగా చూసేవాడిని తెలిపారు.
శ్రీధర్ నిజంగా కాంగ్రెస్ వాడివే అయితే కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వికలాంగుల పెన్షన్ పెంచుతామని ఇచ్చిన దొంగ హామీనీ నేడు నిజం చేయాలని ధ్వజమెత్తారు.ప్రజల సొమ్ము బకాసురుడిలా దోచుకు తిని తిరిగే నీలాంటి వాడు మహిళాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇకపై మళ్లీ వికలాంగుల గురించి అసభ్యకరంగా మాట్లాడితే బట్టలు విప్పి, చెప్పులు మేడలో వేసి చెప్పులతో కొడతామని వికలాంగుల సంఘ నాయకులు, సభ్యులు,మహిళా నాయకులు హెచ్చరించారు.