28వ అపెక్ సదస్సులో జిన్‌పింగ్
బీజింగ్: అపెక్ (ఆసియాపసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ) దేశాల పరస్పర ప్రయోజనంకోసం సహకరించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం జరిగిన 28వ ఆసియా
పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (అపెక్) ఆర్థిక నాయకుల సమావేశానికి జిన్‌పింగ్ వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ)తో బహుళపక్ష వాణిజ్య పాలనను కాపాడుకోవడంలో చైనా సంకల్పాన్ని జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. ఆసియాపసిఫిక్ ఆర్థిక సహకారం కోసం చైనా అపెక్ సభ్యులందరితో కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 21అపెక్ సభ్య దేశాల ఆర్థికవ్యవస్థలు అత్యవసర పని విధానం ద్వారా ఉత్పన్నమయ్యే తక్షణ సంక్షోభానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. కోవిడ్
19 ప్రభావంతో ఆర్థిక పునరుద్ధరణను ఎదుర్కోవడంలో అపెక్ సభ్యుల సహకారం కోసం తగిన ఉపనిధికి చైనా సహాయపడుతుందని జిన్‌పింగ్ ప్రతినపూనారు. చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రువాన్ జోంగ్జే మాట్లాడుతూ, మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడంలో సహకారం ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. కోవిడ్`19 మహమ్మారి ప్రభావంతో అన్ని దేశాలు ధనిక పేద అనే తేడా లేకుండా కీలక సవాళ్ల నుండి ఎవరూ బయటపడలేదని రువాన్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీని ప్రోత్సహించాలని అపెక్ సభ్యులకు పిలుపునిచ్చారు.
చైనా 1.7 బిలియన్ డోస్ వ్యాక్సిన్ల సహాయం
ఇప్పటివరకు, చైనా 110 కంటే ఎక్కువ దేశాలకు విరాళాలతో సహా ప్రపంచానికి 1.7 బిలియన్ డోస్ వ్యాక్సిన్‌లను అందించింది. చైనా మూడు బిలియన్ యు.ఎస్. డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక, సామాజిక పునరుద్ధరణకు మద్దతుగా రాబోయే మూడు సంవత్సరాలలో సహాయం చేయనుంది. ఇండోనేషియా, అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ టీకా కార్యక్రమాలలో చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్ వ్యాక్సిన్‌లు కీలక పాత్ర పోషించాయని ఇండోనేషియా మేథావుల ఆసియా ఇన్నోవేషన్ స్టడీ సెంటర్ చైర్మన్ బాంబాంగ్ సూర్యోనో చెప్పారు.ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణకుగాను అపెక్ దేశాలు విజన్ 2030 మార్గదర్శకాలను అనుసరించాలని స్వేచ్ఛా వాణిజ్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని జిన్‌పింగ్ కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థతో బహుళ పక్ష వాణిజ్య పాలనను కాపాడుకోవడంలో చైనా సంకల్పాన్ని అపెక్ దేశాలు మద్దతు పలికాయి.