వియన్నా : ఆస్ట్రియాలో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో జరిగిన స్థానిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఆస్ట్రియా (కేపీఓ) విజయం సాధించింది. యూరోపియన్ లెప్ట్ పార్టీకి కేపీఒ అనుంబంధ పార్టీగా ఉంది. ఇది గ్రీస్‌లోని సిరిజా, జర్మనీలోని దిలింకే, స్పెయిన్‌లోని యునైటెడ్ లెఫ్ట్ వంటి సామాజిక ప్రజాస్వామ్య రాజకీయ కూటమికి చెందినది. గ్రాజ్ శాఖలోని కేపీఓ పార్టీ బలమైన శక్తిగా రూపొందింది. మార్క్సిస్టులెనినస్టు వర్గంతో విడిపోయి.2013లో ఏర్పడిన పార్టీ ఆఫ్ లేబర్(పీడీఏ) ద్వారా బలమైన పార్టీగా నెలకొంది. పార్టీ ఆఫ్ లేబర్ చైర్మన్ టిబోర్ జెంకర్ మాట్లాడుతూ కేపీఓ మార్క్సిస్టు
లెనినిస్టు పార్టీ కానప్పటికీ వర్గపోరాటం, సోషలిస్టు భావజాలం, కమ్యూనిజం వంటి అంశాలు కేపీఓ కార్యకలాపాలలో భాగమేనని తెలిపారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌పీఓ) అడుగుజాడలలో కేపీఓ గ్రాజ్‌లో ప్రత్యామ్నాయ సామాజిక ప్రజాస్వామ్యంగా ఉంది.