100 మందికి పైగా దుర్మరణం
ఫ్రీటౌన్ : ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో భారీ దుర్ఘటన చోటుచేసుకుంది. రాజధాని ఫ్రీటౌన్‌కు తూర్పున ఉన్న శివారు ప్రాంతమైన ఫ్రీటౌన్‌లో ఇంధన ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి 100 మందికి పైగా మృతి చెందారు. డజన్ల మంది గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడిరచారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని సియెర్రా లియోన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మహ్మద్ లామరానే బాప్‌ా తెలిపారు. గాయపడిన వారిని అసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయిల్ చుట్టుపక్కల దుకాణాలు, ఇళ్లపై పడటంతో మంటలు చెలరేగి చాలామంది అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు జూలియస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. పది లక్షల మందికి పైగా నివసించే ఫోర్ట్ సిటీ ఇటీవల కాలంలో అనేక విపత్తులను ఎదుర్కొంది. మార్చిలో నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు వేలమంది నిరాశ్రయులయ్యారు. 2017లో భారీ వర్షాలకు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వెయ్యి మందికి పైగా మరణించారు.