ఏథెన్స్ : ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కార్మికుల ప్రయోజనాలు, దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం ఇటాలియన్ ట్రేడ్ యూనియన్ (యూఎస్‌బీ) సంఘాలు ఈ నెల 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా దేశంలోని ప్రజారవాణా స్తంభించనుంది. ట్రామ్‌లు, బస్సులు, మెట్రో, రైల్‌సర్వీసులను నిలిపివేయనున్నారు. డ్రాగి ప్రభుత్వంలో నెలకొన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి, తొలగింపులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని కార్మిక సంఘాలు పెద్దఎత్తున 24గంట సమ్మె తలపెట్టింది. సీజీఐఎల్, సీఐఎస్‌ఎల్, యూఐఎల్ వంటి కార్మిక సంఘాలు ఈ సమ్మెకు తమ మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో జీతాలు, పెన్షన్లను తగ్గించడం, విద్యుత్, గ్యాస్ ధరల భారీ పెరుగుదల ప్రజలపై పెనుభారం కానుండటంతో ప్రజలు తీవ్ర అసహానానికి లోనయ్యారు. రోమ్‌లో 24గంటలపాటు బస్సు, మెట్రో సదుపాయాల్ని నిలిపివేయనున్నారు. ప్రజారోగ్యం, పరిశోధన, ప్రాథమిక వైద్యం, పారామెడికల్ సిబ్బంది సదుపాయం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తదుపరి ఈయూ ప్రణాళిక 20 బిలియన్‌యూరోలు కాగా 22 యూరోలు మాత్రే ఆరోగ్యసంరక్షణకు కేటాయించారు. గ్రీన్‌పాస్‌లో పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి