Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా రైసీ

టెహ్రాన్‌: ఇరాన్‌ నూతన అధ్యక్షుడుగా ఇబ్రహీం రైసీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మితవాద హసన్‌ రౌహనీ నుంచి రైసీ బాధ్యతలు స్వీకరించారు. అమెరికా ఆంక్షలు, ఆరోగ్య సంక్షోభం, ఆణు కార్యక్రమాలపై జరుగుతున్న చర్చలు ఇరాన్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వివిధ సమస్యల నేపథó్యంలో రైసీ బహుళ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. జూన్‌ 18న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రైసీ సాయంత్రం 6గంటలకు పార్లమెంటు ముందు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు చుట్టూ ఉన్న వీధుల్లో ట్రాఫిక్‌ పరిమితులు నియంత్రించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అల్బోర్ట్‌, కజ్విన్‌ ప్రావిన్స్‌లలో విమానాలను నిలిపివేశారు. రైసీ ప్రమాణస్వీకారానికి ఇరాక్‌, ఆఫ్గాన్‌ అధ్యక్షులతోపాటు రష్యా, దక్షిణాఫ్రికా,సిరియా దేశాల నుండి పార్లమెంటు స్పీకర్లతో సహా ఈ వేడుకలకు హాజరయ్యారు. టెహ్రాన్‌లో బుధవారం ఇరాన్‌ విదేశాంగమంత్రి మహ్మద్‌జావేద్‌ జరీఫ్‌తో ఈయూ దౌత్యవేత్త, అణుఒప్పంద సంధానకర్త ఎన్రిక్‌ మోర్‌లు సమావేశమయ్యారు. అణుఒప్పందాన్ని పునరుద్దరించే యత్నంలో భాగంగా ఏప్రిల్‌జూన్‌ల మధ్య ఇరాన్‌, ప్రపంచదేశాలమధ్య ఆరు రౌండ్ల చర్చలు వియన్నాలో జరిగిన విషయం తెలిసిందే.. జూన్‌ 20న చివరి రౌండ్‌ ముగిసింది. 2018,2019 కాలంలో ఇరాన్‌ ఆర్థికవ్యవస్థ ఆరుశాతానికి పైగా క్షీణించింది. నీరు, విద్యుత్‌,టీకాల కార్యక్రమం రైసీ ముందున్న ప్రధాన సమస్యలు. ఇరాన్‌వెనిజులా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం
అమెరికాను తటస్థం చేసేందుకు ఇరాన్‌,వెనిజులా దేశాధినేతలు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు సంకల్పించారు. అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తామని రైసీ నొక్కిచెప్పారు. ఇరాన్‌,వెనిజులా వంటి స్వతంత్ర దేశాల అభివృద్ధిని నిరోధించేందుకు అమెరికా కుటిల యత్నాలు విఫలమయ్యాయని రైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వెనిజులా వంటి దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవాలనే తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మదురో పంపిన సందేశాన్ని వెనిజులా డిప్యూటీ మంత్రి రైసీకి అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img