హవానా : లాటిన్ అమెరికా దేశమైన క్యూబాలో అత్యంత ప్రతిభావంతుతైన రచయితలలో ఒకరైన పాబ్లో ఫెర్నాండజ్ మృతి చెందారని సాంస్కృతిక మంత్రి అలోన్సో తెలియజేశారు. ఫెర్నాండెజ్ 1931లో లాస్ టునాస్ ప్రావిన్స్‌లో జన్మించారు. తన స్వగ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన తరువాత ఆయన న్యూయార్క్‌కు వెళ్లాడు, 1959లో క్యూబా విప్లవం విజయం తర్వాత క్యూబాకు తిరిగి వచ్చారు. ఆయన 20కిపైగా పుస్తకాలను రచించారు. అతని కవితా రచనలో ప్రధానమైనవి హిమ్స్ (1962), సూట్ ఫర్ మరుజా (1978), లెర్నింగ్ టు డై (1983), రౌండ్ ఆఫ్ ఎన్‌చాన్‌మెంట్ (1990), బుక్ ఆఫ్ లైఫ్ (1997), ఆఫ్ స్టోన్స్ అండ్ వర్డ్స్ (1999) మరియు ది లిటిల్ నోట్‌బుక్ ఆఫ్ మనీలా హార్ట్‌మన్ (2000). ‘‘ఫెర్నాండెజ్ అత్యంత ప్రతిభావంతులైన, ప్రియమైన రచయితలలో ఒకరు. అతని బంధువులు, స్నేహితులకు మా సంతాపం తెలియజేస్తున్నాము’’ అని అలోన్సో పేర్కొన్నారు. 1960లో ఆయన మొదటి రచనలు ఆరిజిన్స్ పత్రికలో ప్రచురించారు. విప్లవ సాహిత్య వార పత్రికకు ఆయన ఎడిటర్‌గా ఉన్నారు. 1961`1962ల మధ్య ఆయన ‘ది హౌస్ ఆఫ్ ది అమెరికాస్’ పత్రికకు సంపాదకీయాన్ని రాసేవారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రచురణలకు సంబంధించి క్యూబా కమిషన్ చీఫ్‌గా పనిచేశారు.1970లలో ఫెర్నాండెజ్ క్యూబన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎడిటోరియల్ బోర్డ్‌లో సభ్యుడిగా, హౌస్ ఆఫ్ ది అమెరికాస్ అవార్డ్, హవానా లాటిన్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్, మిగ్యుల్ డి సెర్వంటెస్ అవార్డ్ జ్యూరీ సభ్యుడు అయ్యాడు. పాబ్లో సాహిత్య కృషికిగాను సాహిత్య విమర్శ బహుమతి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రదానం చేసిన రౌల్ గోమెజ్ పతకాన్ని పాబ్లో పొందారు.