శాంతి, సుస్థిరతకు జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్: చైనాలో కమ్యూనిస్టు పార్టీ పాలనకు 75ఏళ్లు అయ్యాయి. సోవియట్ యూనియన్ 74ఏళ్ల మైలురాయిని చైనా అధిగమించింది. ఈ సందర్భంగా టియాన్మెన్ స్క్వేర్‌లో పతాకావిష్కరణ, వేడక జరిగాయి. రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ పీపుల్స్ ఆఫ్ ది పీపుల్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్ విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు సభలో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) పాలనలో సాధించిన విజయాలు, మానవాళి అభివృద్ధికి, శాంతి స్థాపనకు చేపట్టిన చర్యలను జిన్‌పింగ్ గుర్తుచేశారు. కొత్త శకంలో కొత్త ప్రమాణం మొదలవుతోందని ఉద్ఘాటించారు. చైనాను మరింత శక్తిమంతమైన దేశం నిర్మించుకోవడం అవసరమని అన్నారు. అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా చైనా ఆధునికీకరణ దిశగా ముందుకెళ్లడం ముఖ్యమని చెప్పారు. ఈ దిశగా ఎదురయ్యే అనేక సవాళ్లును అధిగమించేందుకు సంసిద్ధంగా ఉండాలని సీపీసీ పాలకపక్షానికి జిన్‌పింగ్ సూచించారు. సోషలిజం మార్గానికి కట్టుబడాలన్నారు. పరస్పర సహకారం, నాయకత్వంలో పార్టీకి పెద్ద పీట ద్వారానే చైనా అధునికీకరణ లక్ష్యాలు సాధ్యమని చెప్పారు. హాంకాంగ్, మకావ్‌కు సంబంధించి ఒక దేశం, రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేయడానికి కట్టుబడాలని, ఇది ఎంతో ముఖ్యమని జిన్‌పింగ్ నొక్కిచెప్పారు. హాంగ్‌కాంగ్, మకావ్‌లో దీర్ఘకాల సుస్థిరత, సుసంపన్నతను ఆకాంక్షించారు. తైవాన్ తమ దేశంలో అంతర్గత భాగమంటూ పునరేకీకరణకు పిలుపునిచ్చారు. తైవాన్ స్ట్రెయిట్‌తో సమన్వయం, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతాన్ని ఆకాంక్షించారు. తైవాన్ వేర్పాటువాదాన్ని వ్యతిరేకించాలన్నారు. సమస్త మానవాళి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్, శాంతి స్థాపనలో చైనా మరింత కీలకంగా వ్యవహరించాలని జిన్‌పింగ్ అన్నారు. 75ఏళ్ల తర్వాత కూడా ఎన్నో సవాళ్లు తమ ఎదుట ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు సిద్ధంగా కావాలని కోరారు.