Friday, December 1, 2023
Friday, December 1, 2023

ట్విట్టర్‌ డీల్‌.. గుడ్‌బై చెప్పిన ఎలాన్‌ మస్క్‌

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ను కొనుగోలు చేసి దాన్ని ప్రైవేటు కంపెనీగా మార్చాలనుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌..మూడు నెలలు తిరక్కుండానే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌తో అగ్రిమెంట్‌ సరైన రీతిలో లేదని ఆయన ఆరోపించారు. స్పామ్‌, ఫేక్‌ అకౌంట్లపై సమగ్రమైన సమాచారాన్ని ట్విట్టర్‌ ఇవ్వలేకపోయిందని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుతుగున్నట్లు మస్క్‌ తెలిపారు. అయితే మస్క్‌ నిర్ణయంపై ట్విట్టర్‌ స్పందించింది. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మస్క్‌ అంగీకరించిన ధరకు, షరతులకు లోబడే కట్టుబడి ఉన్నామని ట్విట్టర్‌ బోర్డ్‌ చైర్మెన్‌ బ్రెట్‌ టేలర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img