దర్యాప్తును ఖండిరచిన చైనా
బీజింగ్: కరోనా వైరస్ ప్రారంభ స్థానాన్ని గుర్తించేందుకు రెండవ దశ దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సూచించిన ప్రణాళికను చైనా తిరస్కరించింది. కొవిడ్ మూలాలపై పరిశోధన కోసం డబ్ల్యుహెచ్‌ఓ మళ్లీ మా దేశంలో పర్యటించడం మమ్మల్ని షాక్‌కు గురి చేసిందని చైనా వైద్యాధికారి తెలిపారు. ఉహాన్ కరోనా ల్యాబ్ నుంచి వైరస్ లీకయ్యిందనే వార్తలు అవాస్తవం..దీని గురించి మీ విజ్ఞతకే వదిలివేస్తున్నా అని జాతీయ ఆరోగ్య కమిషన్ ఉపాధ్యక్షుడు జెంగ్ అన్నారు.తమ ల్యాబ్ లీక్‌పై ఎటువంటి ఆధారాలు లేవని చైనా నిపుణులు స్పష్టం చేశారు. ఈ వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేయాలని అధ్యయనంలో భాగంగా చైనాలోని ప్రయోగశాలలు, మార్కెట్లను ఆడిట్ చేయాలన్న ప్రతిపాదనను చైనా తిరస్కరించిందని నేషనల్ హెల్త్ కమిషన్ గురువారం వెల్లడిరచింది. వైరస్‌పుట్టుక, ఆనవాళ్లను పసికట్టే దర్యాప్తును అంగీకరించడంలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మంత్రి జెంగ్ తెలిపారు.ఈ వైరస్ సహజంగా జంతువుల్లోంచి మరో ఆతిధ్య జంతువులోకి చేరి…అక్కడినుంచి మనుషులకు సోకిందని వెల్లడిరచారు. ప్రపంచారోగ్యసంస్థ నియమించిన చైనా నిపుణుల బృందానికి అధ్యక్షత వహిస్తున్న లియాంగ్ వాన్నియన్ బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాముఇ టువంటి ప్రారంభ స్థానాల జాడను గుర్తించే ప్రణాళికను అంగీకరించబోమని తెలిపారు. చైనా దర్యాప్తులో భాగస్వామిగా ఉండబోదని పేర్కొన్నారు. వైరస్ పుట్టుకను శాస్త్రీయ అంశంగా పరిగణించాలన్నారు. కరోనా గుట్టు విప్పడానికి మేం కట్టుబడి ఉన్నా..సైన్స్ ఆధారంగా పరిశోధన జరగాలి..కానీ ల్యాబ్ లీక్ దర్యాప్తు అంశాన్ని రాజకీయాలకు ముడివేస్తోందన్నారు. చైనాలో కాకుండా..ఇతర దేశాల్లో పరిశోధనలు చేయాలని సూచించారు. చైనాలో కొవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తొలి రోజులనాటి సమాచారం లేకపోవడం వల్ల చైనాలో ఈ మహమ్మారి ప్రారంభంపై దర్యాప్తు జరపడానికి ఆటంకాలు ఏర్పడుతు న్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల పేర్కొంది. దీనిపై జెంగ్ స్పందిస్తూ, గోప్యతకు సంబంధించిన కారణాల వల్ల కొంత సమాచారాన్ని పూర్తిగా పంచుకోవడం సాధ్యం కాదన్నారు. చైనా నిపుణులు ఇచ్చిన సలహాలను డబ్ల్యూహెచ్‌ఓ శ్రద్ధగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనాన్ని రాజకీయం చేయడాన్ని చైనా వ్యతిరేకిస్తోందని చెప్పారు.