Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

దేశ భవిష్యత్‌కు కొత్త బాటలు వేద్దాం

. 21వ శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుదాం
. ఐక్యంగా ముందుకెళదాం
. ట్రంప్‌కు పగ్గాలిస్తే అధోగతే
. ఆయన విధానాలతో దేశం వెనక్కి
. డెమొక్రటిక్‌ జాతీయ సదస్సులో కమలా హారిస్‌
. డెమొక్రటిక్‌ పార్టీ ‘అధ్యక్ష’ నామినేషన్‌కు అధికారిక అంగీకారం

చికాగో: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌ పార్టీ తరపున నామినేషన్‌ను దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అధికారికంగా స్వీకరించారు. చికాగోలోని యునైటెడ్‌ సెంటర్‌లో డెమొక్రటిక్‌ జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. ‘పార్టీ, జాతి, వర్గం, లింగం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమెరికన్‌ తరపున అధ్యక్ష పీఠానికి ప్రాతినిధ్యం వహించేందుకు అంగీకరిస్తున్నా’ అన్నారు. కమలా హారిస్‌కు పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతు పలికారు. కరతాళధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఆమెకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కమలా హారిస్‌ ప్రసంగిస్తూ దేశ భవిష్యత్‌కు కొత్త బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే 21వ శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని, అమెరికాను మరింత బలోపేతం చేస్తానని, ప్రపంచ నాయక త్వాన్ని త్యజించేది లేదని సంకల్పించారు. అమెరికన్లను ఐక్యంగా ఉంచే అధ్యక్షురాలినవుతానని, అమెరికా భవిష్యత్‌ కోసం పాటుపడతానని హామీ నిచ్చారు. గత చేదు అనుభవాలను, విభజన విధానాలు, విద్వేషాలను మరిచి ముందుకు సాగడమే కాకుండా కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఎన్నికలు సువర్ణావకాశమిస్తున్నాయని కమలా హారిస్‌ అన్నారు. ఒక పార్టీగా లేక వర్గంగా కాదు అమెరికన్లుగా కొత్త పథం తొక్కుదామన్నారు. తాను ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానన్నారు. ఉక్రెయిన్‌ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడిరచారు. అధ్యక్ష పీఠానికి ఎన్నికైతే ఏం చేయాలన్న విజన్‌ తనకున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరలు తగ్గిస్తానన్నారు. ఆరోగ్య సంరక్షణ, గృహం, సరుకులు, కూరగాయాల ధరలను నియంత్రిస్తానని హామీనిచ్చారు. గర్భవిచ్చిత హక్కును సమర్థిస్తూ అది స్వేచ్ఛ పరిరక్షణకు మార్గమన్నారు. తమ జీవితాలు ముఖ్యంగా మనస్సు, ఇంటి గురించి నిర్ణయాలను అమెరికన్లు సొంతంగా తీసుకోనంత వరకు అమెరికా సుసంపన్నం కాలేదని చెప్పారు. ‘మీరు ఎవరో మీరే చాటుకోండి… ఎవరో వచ్చి మీకు చెప్పాల్సిన అవకాశం ఇవ్వకండి’ అని ఉద్బోధించారు. కమలా హారిస్‌ దాదాపు 45 నిమిషాల పాటు ఉత్సాహభరితంగా మాట్లాడారు. శ్వేతసౌధంలోకి అడుగుపెడితే ఏమీ చెయ్యగలరన్నది అమెరికన్లకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘నేను వెళ్లే ప్రతి చోటు… కలిసే ప్రతిఒక్కరిలోనూ ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్న దేశమే నాకు కనిపిస్తుంది’ అని చెప్పారు. అమెరికా అద్భుత ప్రయాణం మొదలు కాబోతోంది’ అని కమలా హారిస్‌ ఉద్ఘాటించారు.
మాది మధ్యతరగతి కుటుంబం…
తన మధ్యతరగతి మూలాలను కమలా హారిస్‌ గుర్తుచేసుకున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం, తల్లి పడిన కష్టం, తన బాల్యం, కాలిఫోర్నియాలోని ఆక్‌ల్యాండ్‌లో శ్రామిక వర్గంలో పెరిగిన వాతావరణం గురించి, చిన్ననాటి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. ‘మాది మధ్యతరగతి కుటుంబం. ఖర్చు విషయంలో అమ్మ చాలా కచ్చితంగా ఉండేవారు. ఉన్నదాంట్లో సర్దుకునేవాళ్లం. పెద్దగా ఆశలేమీ పెట్టుకునేవాళ్లం కాదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకో వాలని, జీవితంలో ఎదగాలని అమ్మ మా కోసం కలలు కన్నారు’ అని కమలా హారిస్‌ చెప్పారు. న్యాయవాది వృత్తిని ఎంచుకోవడం వెనుక కారణాన్ని వెల్లడిరచారు. నాకున్న ఏకైక క్లయింట్‌ ‘ప్రజలు’ అని ఆమె అన్నారు. ప్రాసిక్యూటర్‌ నుంచి రాజకీయ నేత వరకు సాగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
గాజాలో కాల్పుల విరమణకు ఇదే సమయం
గాజాకు సంబంధించి తన వైఖరిలో మార్పు లేదని కమలా హారిస్‌ చెప్పారు. ‘అధ్యక్షుడు బైడెన్‌, నేను నిర్విరామంగా పనిచేస్తున్నాం. బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం ఒప్పందానికి ఇదే సమయం’ అని అన్నారు. ఇజ్రాయిల్‌కు ఎల్లప్పుడు ఆత్మరక్షణ సామర్థ్యం ఉండేలా చూస్తానని సంకల్పించారు. ఉక్రెయిన్‌, గాజా యుద్ధాల గురించి మాట్లాడుతూ పలస్తీనియన్ల దుస్థితి గుండెల్ని పిండేస్తోందన్నారు. ఈ సదస్సు సందర్భంగా వేదిక వద్ద పలస్తీనాకు మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ‘తక్షణమే కాల్పుల విమరణ’, ‘సిగ్గుసిగ్గు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పలస్తీనా అనుకూల వర్గాన్ని తన మాటలతో శాంతింపజేసేందుకు కమలా హారిస్‌ ప్రయత్నించారు.
ట్రంప్‌తో దేశానికి ప్రమాదకరం
తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష రేసులో నిలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌పై కమలా హారిస్‌ విమర్శల వర్షం కురిపించారు. ఆయన దేశానికి ప్రమాదకరమన్నారు. ఇలాంటి వారికి పగ్గాలు అప్పగిస్తే దేశం అధోగతవుతుందని హెచ్చరించారు. చాలా విధాలుగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవికి అనర్హులుని వ్యాఖ్యానించారు. గద్దెనెక్కిస్తే తీవ్ర పరిణామాలను తప్పబోవన్నారు. క్యాపిటల్‌పై ట్రంప్‌ మద్దతుదారుల దాడిని గుర్తుచేశారు. ఆత్మస్తుతికి పరిమితమయ్యే వ్యక్తిని గద్దెనెక్కిస్తే మన దేశం అగమ్యగోచరమవుతుందన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే ముందు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని కోరారు. ట్రంప్‌ విధానాలన్నీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయన్నారు. సొంత పార్టీ నేతలే ఘర్షణలను నిలువరించాలని కోరినప్పటికీ ఆయన వాటికి ఆజ్యం పోశారని క్యాపిటల్‌ అల్లర్లనుద్దేశించి కమలా హారిస్‌ అన్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్‌ను మెచ్చుకున్నారు.ఆయన స్ఫూర్తిదాయకమని, బైడెన్‌ పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img