జ్యూరిచ్: అమెరికా
చైనాల అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు ప్రాతిపదికగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీ సభ్యుడు, విదేశీ వ్యవహారాల డైరెక్టర్ యాంగ్ జీచి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్‌తో బుధవారం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం నిర్మాణాత్మకమైనదిగా పరస్పర అవగాహన పెంపుదలకు అనుకూలమైనదిగా రెండు దేశాల నాయకులు పేర్కొన్నారు. చైనా, అమెరికా తమ సంబంధాలను చక్కగా నిర్వహించగలవా లేదా అనేది రెండు దేశాలు, ప్రజల ప్రాధమిక ప్రయోజనాలపై అలాగే ప్రపంచ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని యాంగ్ పేర్కొన్నారు. చైనా అమెరికాలు రెండు దేశాలు సహకారంతో ప్రపంచం ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడ్డారు. చైనా అమెరికాపై సానుకూల వ్యాఖ్యలకు ప్రాముఖ్యతనిస్తుందని యాంగ్ అన్నారు. దేశీయ, విదేశీ విధానాలు, వ్యూహాత్మక విధానాలను సరిగా అర్థం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాల గురించి లోతైన అవగాహనకు రెండు దేశాలు సంకల్పించాయి. ఉభయ పక్షాలు వాతావరణ మార్పు, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. చైనా సార్వభౌమత్వాన్ని, భద్రత, అభివృద్ధిప్రయోజనాలను గౌరవించాలని అమెరికాను కోరారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని ఖండిరచింది. శాంతియుత సహజీవం, సహకార మార్గాన్ని రెండు దేశాలు ప్రోత్సహించాయి.