జి`20 దేశాల పర్యావరణ మంత్రుల అభిప్రాయం
నేపుల్స్ : పర్యావరణ సమస్యలపై సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకతను జీ20 సభ్యదేశాలు గుర్తించాయి. జి20 సభ్య దేశాల పర్యావరణ, ఇంధన శాఖల మంత్రులు ఇటలీలోని నేపుల్స్‌లో సమావేశమయ్యారు. జీవవైవిధ్య కాలు ష్యం, దాని ద్వారా జరిగే నష్టం, వ్యవసాయ భూమి క్రమంగా క్షీణించడం, వరదలు, భారీ వర్షాలు, కరోనా, ఎడారీకరణ, కార్చిచ్చు తదితర అంశాలపై సమావేశంలో విస్త్రతంగా చర్చలు జరిపారు. ఇటలీ పర్యావరణ మంత్రి రాబర్టో సింగోలానీ మంత్రులకు స్వాగతం పలికారు. వాతావరణ మార్పుపై శాస్త్రీయ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చారు. ఇటీవలి కాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సంఘటనలు వాతావరణపై పెనుప్రభావం చూపు తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి, వాతావరణ సంక్షోభం, అడవుల కార్చిచ్చు వంటి సమస్యలపై ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రకృతి పరిరక్షణపై స్థిరమైన విధానాలను చర్చించారు. మొదటి సెషన్‌లో టర్కీ పర్యావరణ, పట్టణీకరణ మంత్రి కురుమ్ మాట్లాడుతూ వాతా వరణ మార్పులకు వ్యతిరేకంగా టర్కీ తన పోరాటాన్ని కొనసాగిస్తోందని, ఒక దేశం మాత్రమే ఒంటరిగా ఇటువంటి పోరాటాలు కొనసాగించ లేదని అన్నారు. వాతావరణమార్పు, కాలుష్యానికి సరిహద్దులులేవు.. ప్రకృతిలో జరిగే వాతావరణ మార్పులకు, పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా పోరాటంలో సమష్టిగా వ్యవహరించాలని నిర్ణయిం చారు. రానున్నకాలంలో జీవవైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి16వ సమావేశాన్ని టర్కీ నిర్వహిస్తుందని కురుమ్ అన్నారు. జి
20 దేశాల సమావేశం కార ణంగా నేపుల్స్‌లో భద్రతాచర్యలు కట్టుదిట్టం చేశారు.