బంగ్లాదేశ్ ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్
ఢాకా: భారత్‌తో తమ దేశం సుహృద్భావ సంబంధాలు కోరుకుంటోందని బంగ్లాదేశ్ ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ చెప్పారు. ఇవి సమాన హోదాతో పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ బీఎస్‌ఎస్ వెల్లడిరచింది. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహఫుజ్ ఆలం స్పందిస్తూ ‘మేం భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తు న్నాం. ఇవి కచ్చితంగా సమానత్వం, పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని యూనస్ చెప్పారు’ అని వెల్లడిరచారు. పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్)ను పునరుద్ధరిం చాలని యూనస్ నొక్కి చెప్పినట్లు ఆలం తెలిపారు. భారత్‌లో కూర్చొని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు ఆమె భారత్‌లో మౌనంగా ఉండాలన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బంగ్లాదేశ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేనీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘ఆ వ్యాఖ్యలను చూసి నేను ఆందోళన చెందడం కంటే… ఆశ్చర్యపోయాను. ఆయన అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో నాకు తెలియదు. వాటి వెనక నాకు బలమైన కారణమేదీ కనిపించలేదు’ అని అన్నారు.