ఐక్యరాజ్యసమితి : మెరుగైన భవిష్యత్తు కోసం భిన్నత్వాన్ని ముప్పుగా చూడకూడదని ఇదే బలానికి మూలమని భిన్నత్వంపై భద్రతామండలి సమావేశంలో ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ పేర్కొన్నారు. భయానక పరిస్థి తుల నుండి బైటపడే మెరుగైన భవిష్యత్తు కోసం చూస్తున్న దేశాలు వైవిధ్యాన్ని, భిన్న త్వాన్ని ముప్పుగా చూడకూడదని సూచించారు. ఇదే బలానికి, ఐకమత్యానికి మూలమని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. ఒక దేశాన్ని పునర్ని ర్మించేందుకు విభిన్న స్వరాలను చేర్చకుండా ప్రజలందరినీ కూడగట్టకుండా ఏ శాంతి ప్రక్రియ అయినా స్వల్పకాలికంగా ఉంటుందని గుటెర్రస్ హెచ్చరించారు. దీర్ఘకాలంగా ఉన్న మనోవేదనలు, అసమానతలు, అపనమ్మకాలు, సామాజిక విభేదాలు అంతరించిపోవు. సమా జాన్ని పునర్నిర్మించే ప్రక్రియలో శాంతిని నిలబెట్టుకోవడాన్ని ప్రోత్సహించడం కోసం గుటెర్రస్ మూడు ప్రతిపాదనలు చేశారు. ముందుగా జాతీయ సంస్థలు, చట్టాలు ప్రజలకోసం పనిచేయాలి. ప్రజల ఆరోగ్యం, విద్య, రక్షణ, అవకాశాల హక్కులతో సహా మానవ హక్కులను రక్షించడం, ప్రోత్సహిం చడం. జాతి, వయస్సు, లింగం,మతం, వైకల్యం, లైంగికధోరణి, వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను అమలుచేయడం, ప్రజలందరికీ సమానంగా సేవల చేయగల జాతీయ సామర్థ్యాల అభివృద్ధి కోసం భాగస్వా ములతో కలిసి పనిచేయడం తప్పనిసరని తెలిపారు. రెండవది, దేశాలు సబ్‌నేషనల్ ప్రాంతాలకు ఎక్కువ వాయిస్ అందించేలా అన్వేషించాలి. దశాబ్దాలుగా అస్తిరతలో ఉన్న దేశాలు, వారి జనాభా అభిప్రాయాలు, ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగేందుకు మార్గాలను అన్వేషిచాలి. మూడవది..మహిళలు, యువకులు, అట్టడుగున ఉన్నవారు దేశంలో శాంతి నిర్మాణంకోసం కృషి చేయాలి. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ కార్యకలా పాలు, ప్రత్యేక రాజకీయ మిషన్లలో మహిళలు, యువకులను భాగస్వాములను చేయడం, వారు చురుకుగా పాల్గొనడానికి అంతర్జాతీయ సమాజం ప్రోత్సహించడం,మద్దతు ఇవ్వడం కొనసాగించాలని గుటెర్రస్ పేర్కొన్నారు.