Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

మలేషియా ప్రధాని రాజీనామా కోసం ర్యాలీ

కౌలాలంపూర్‌: మలేషియాలో ప్రతిపక్ష సభ్యులు ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు భవన్‌కు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజకీయ గందరగోళాల మధ్య పార్లమెంటు సమావేశాన్ని వాయిదావేసారు. ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు వద్ద నిరసించారు. సుమారు 107 మంది పార్లమెంటు సభ్యులు మిర్‌డెకా కూడలి నుంచి నిరసన ప్రారంభించారు. మాజీ ప్రధాని మహతీర్‌, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు అన్వర్‌ ప్రదర్శన అగ్రభాగాన నడిచారు. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా సోమవారం జరగవలసిన చివరి పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేసానని అయినా ప్రతిపక్షాలు నిరసనలకు దిగడం రాజకీయ ప్రేరేపిత చర్యగా ప్రధాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను కట్టడిచేసేందుకు ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు. నీటి ఫిరంగులను ప్రయోగించారు. తమ డిమాండ్లను లేవనెత్తకుండా ప్రభుత్వం తమ నోళ్లు నొక్కేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేషియాలో కొవిడ్‌ కేసులు 10లక్షలు దాటాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే మలేషియాలో 160 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img