వాషింగ్టన్: బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీనే జీన్ పెర్రే ఒక ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్ వ్యవహారాల్లో తమ జోక్యం ఏమాత్రం లేదని అందులో స్పష్టంచేశారు. అమెరికా గురించి వచ్చేవి అవాస్తవ ప్రకటనలుగా తెలిపారు. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని, అగ్రరాజ్యానికి తలొగ్గని కారణంగానే అధికారాన్ని కోల్పోయినట్లు ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్ట్సి ద్వీపాన్ని అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. దీంతో అమెరికా స్పందించింది. అయితే తన తల్లి ఇటువంటి ప్రకటనే చేయలేదని షేక్ హసీనా తనయుడు సజీబ్ వజేద్ ఒక ప్రకటన చేశారు. కాగా, ఈనెల 5న నిరసనలు మిన్నంటిన క్రమంలో షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన విషయం తెలిసిందే.