తిప్పికొట్టిన ఇజ్రాయిల్
టెల్‌అవీవ్ : ఇజ్రాయిల్ రాజధాని టెల్‌అవీవ్‌లోని మొస్సాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెజ్బుల్లా ఖాదర్-1 క్షిపణి ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా ప్రకటించింది. తమ సంస్థ కమాండర్లపై దాడికి, ఇటీవల పేజర్లు, వాకీటాకీల పేల్చివేతలకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు వెల్లడిరచింది. మరోవైపు ఈ క్షిపణి లెబనాన్ గగనతలం దాటగానే మార్గమధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకొన్నట్లు ఇజ్రాయిల్ దళాలు ప్రకటించాయి. అదే సమయంలో సీ ఆఫ్ గలీల్ దిశగా తమ భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లను కూల్చివేశామని వెల్లడిరచింది. వీటిని ఇరాక్, సిరియా గగనతలం నుంచి ప్రయోగించినట్లు వెల్లడిరచారు. బుధవారం ఉదయం కూడా హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని బెంజమన్ నెతన్యాహు న్యూయార్క్ పర్యటనలో మరోసారి జాప్యం చోటుచేసుకొంది. ‘లెబనాన్‌పై దాడుల నేపథ్యంలో ప్రధాని భద్రతా వర్గాలతో చర్చలు జరిపారు’ అని నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. మరోవైపు హెజ్బుల్లా మిసైల్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ మరణించినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. బీరుట్‌పై జరిగిన క్షిపణి దాడిలో చనిపోయినట్లు తెలిపింది. ఆ సంస్థ చాలా అరుదుగా మాత్రమే హెజ్బుల్లా మృతి చెందినవారిని కమాండర్ అని పేర్కొంటుంది. వాస్తవానికి ఈ దాడి జరిగే సమయంలో ఆ సంస్థ రాకెట్ యూనిట్‌కు చెందిన మరికొందరు కీలక నాయకులు అక్కడే ఉన్నారు.