మాస్కో: రష్యా, చైనా యుద్ధ నౌకలు సంయుక్తంగా నావికా విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం మధ్యధరా నుంచి పసిఫిక్ వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలు, ఒక సరఫరా నౌకతో పాటు రష్యా నౌకలు దక్షిణ వ్లాదివోస్కోట్‌లోని పీటర్ ది గేట్ బేలో ప్రదర్శించాయని రష్యా రక్షణశాఖ వెల్లడిరచింది. మారిటైమ్ ఆర్థిక కార్యకలాపాల క్షేత్రాలు, సముద్ర సంప్రదింపుల రక్షణకు సంబంధించి విన్యాసాలు జరిగాయని తెలిపింది. సెప్టెంబరు 16 వరకు పసిఫిక్, ఆర్టిక్ మహాసముద్రాలు, మధ్యధరా, బాల్టిక్, కాస్పియన్ సముద్రాల్లో జరిగే విన్యాసాలలో భాగంగానే తాజా ప్రదర్శన జరిగిందని పేర్కొంది. మొత్తం విన్యాసాల్లో 400కుపైగా రష్యా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సపోర్ట్ వెజల్స్ పాల్గొంటాయని వెల్లడిరచింది. ఇదిలావుంటే, తమ రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని, భద్రతా సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకునే ఉద్దేశంతో మరింత పెంచుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా వెల్లడిరచింది.