కాల్పులు విరమించాలి: ప్రపంచ నేతలు
బీరుట్: లెబనాన్‌లో భూతల దాడులను ఇజ్రాయిల్ ప్రారంభించింది. ఇప్పటివరకు వైమానిక దాడులు జరుపుతూ వచ్చిన యూద దేశం ఇప్పుడు ఆపరేషన్ నార్తెన్ ఆరోస్‌కు నడుం బిగించింది. దక్షిణ లెబనాన్ గ్రామాల్లోకి చొరబడి భూతల దాడులను మొదలు పెట్టింది. దక్షిణ బీరుట్‌లోని మూడు జిల్లాల ప్రజలను అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయిల్ సైన్యం ఆదేశించింది. ‘హెజ్బుల్లాకు చెందిన స్థావరాల పరిసరాల్లో మీరంతా ఉన్నారు. తక్షణమే భవనాలను ఖాళీ చేయండి’ అంటూ ఇజ్రాయిల్ సైనిక అధికార ప్రతినిధి అవిచే అద్రారీ పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో శత్రుదేశ సైనికులను లక్ష్యంగా చేసుకున్నట్లు హెజ్బుల్లా ప్రకటించడంతో ఇజ్రాయిల్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయిల్ దక్షిణ బీరుట్‌లో ఆరుసార్లు దాడి చేసినట్లు లెబనాన్ భద్రతాధికారి తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా మౌలిక వసతులు లక్ష్యంగా సరిహద్దు గ్రామాలలో పరిమిత దాడులు చేపట్టినట్లు ఇజ్రాయిల్ దళం (ఐడీఎఫ్) ప్రకటించింది. గాజా, ఇతర ప్రాంతాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు వెల్లడిరచింది. తమ భూభాగంలోకి ప్రవేశించాలని ఇజ్రాయిల్ నిర్ణయించుకుంటే… దీటైన బదులు ఇచ్చేందుకు తాము సిద్ధమని హెజ్బుల్లా తేల్చిచెప్పింది. కాగా, గత 24 గంటల్లో లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 95 మంది చనిపోగా, 172 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. బాల్‌బెక్`హెర్మల్ జిల్లాలో 16 మంది హతం కాగా 48 మందికి గాయాలయ్యాయని పేర్కొంది. అలాగే నబాతే గవర్నరేట్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని, 55 మంది గాయపడ్డారని వెల్లడిరచింది. బీరుట్‌లో నలుగురు చనిపోగా, మరో నలుగురికి గాయాలైనట్లు నివేదించింది. అటు సిరియా రాజధాని దమాస్కర్‌లోనూ ఇజ్రాయిల్ దురాక్రమణ మొదలైంది. తమ భూభాగంలో ఇజ్రాయిల్ మూడుసార్లు దాడి చేసిందని సిరియా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఇజ్రాయిల్ దాడుల్లో యాంకర్ సఫా అహ్మద్ ప్రాణాలు కోల్పోయారని, మరో ముగ్గురు పౌరులు చనిపోయారని, ఇంకో తొమ్మిది మందికి గాయాలయ్యాయని తెలిపింది. ఇజ్రాయిల్ సైన్యం కొన్నేళ్లుగా సిరియాపై వందల దాడులు చేసింది. దక్షిణ బీరుట్‌పై ఇజ్రాయిల్ వైమానిక దళం బాంబుల వర్షంకురిపించింది. సిడాన్ నగరంలోని ఐన్ అల్ హెవెల్ క్యాంపు లక్ష్యంగా దాడి చేసింది. ఇదిలావుంటే, ఇజ్రాయిల్ ఏకపక్షంగా దాడులు చేస్తూ, పశ్చిమాసియా దేశాలను లక్ష్యంగా చేసుకుంటుండటాన్ని ప్రపంచ దేశాల నాయకులు తీవ్రంగా ఖండిరచారు. దురాక్రమణ, దమనకాండ ఆపాలంటూ ఇజ్రాయిల్‌కు సూచించారు. ఉద్రిక్తతలు పెంచవద్దని హితవు పలికారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు అధికార ప్రతినిధి స్టిఫనే దుజారిక్ స్పందిస్తూ ఏ విధంగానూ భూతల దాడులు జరగాలని కోరుకోవడం లేదని వెల్లడిరచారు. ఇజ్రాయిల్ వెనక్కు తగ్గడం అవసరమని, మిగతా వర్గాలు కూడా సంయమనం పాటించాలన్నారు. ఇజ్రాయిల్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తక్షణమే కాల్పులు విరమించాలంటూ పిలుపునివ్వడం గమనార్హం.
గాజా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ దాడి: 12 మంది మృతి
గాజా: సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ వైమానిక దాడిలో 12 మంది చనిపోయారని, అనేక మందికి గాయాలయ్యాయని పలస్తీనా అధికారి తెలిపారు.
క్యాంపులోని రెండు నివాసాలు లక్ష్యంగా ఇజ్రాయిల్ యుద్ధవ విమానాలు దాడి చేసినట్లు గాజా పౌర రక్షణ శాఖ అధికార ప్రతినిధి మెప్‌ామూద్ బసల్ వెల్లడిరచారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. గతేడాది అక్టోబరు 7 నుంచి ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు సుమారు 42వేల మంది పలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.