విచారణకు బంగ్లాదేశ్ కోర్టు ఆదేశాలు
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసులో విచారణకు అక్కడి కోర్టు ఆదేశించింది. జులై 19న పోలీసుల కాల్పుల్లో చనిపోయిన అబు సయ్యద్ తరపున ఆయన శ్రేయోభిలాషి ఈ కేసు దాఖలు చేశారు. నిందితుల్లో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్, హోంశాఖ మాజీ మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ సహా పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు కలిపి మొత్తం ఏడుగురున్నారు. ప్రధానిగా రాజీనామా, భారత్ పలాయనం తర్వాత షేక్ హసీనాపై ఈ కేసు నమోదైంది.